Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంపై ఏఆర్ రెహమాన్ కుమారుడు, కూతురి స్పందన

AR Rahman son and daughter reaction on parents divorce
Advertisement
  • విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు
  • 29 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు
  • తమ గోప్యతను గౌరవించాలన్న రెహమాన్ కుమారుడు
Advertisement
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్, ఆయన భార్య విడిపోయిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 29 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ... ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య దూరాన్ని సృష్టించాయని రెహమాన్ భార్య సైరా బాను తరపు లాయర్ వందనా షా తెలిపారు. 

తమ తల్లిదండ్రులు విడిపోతుండటంపై వారి కుమారుడు అమీన్, కూతురు రహిమా స్పందించారు. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ తమ గోప్యతను గౌరవించాలని అమీన్ కోరారు. మీరు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. రహిమా స్పందిస్తూ... ఈ విషయంలో గోప్యత పాటిస్తూ, గౌరవిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు.
Advertisement
Advertisement
AR Rahman
Divorce

More Telugu News